Adipurush: ‘ఆదిపురుష్‌’లో నటిస్తోన్నందుకు చాలా గర్వంగా ఉంది: కృతి సనన్‌

‘ఆదిపురుష్‌’ సినిమాలో నటిస్తోంన్నందుకు చాలా గర్వంగా ఉందని కృతి సనన్‌ (Kriti Sanon) తెలిపింది. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక విజువల్‌ వండర్‌గా అలరిస్తుందని ఆమె పేర్కొంది. 

Published : 06 Feb 2023 12:24 IST

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ (Adipurush) కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో అత్యున్నత సాంకేతికతతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన కృతి సనన్‌(Kriti Sanon) నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఆదిపురుష్‌’ గురించి మాట్లాడిన కృతి.. ఇలాంటి సినిమాలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూశాక అలానే అనుకుంటారని చెప్పింది.

ఇక ఈ సినిమాలో సీత పాత్ర తనకెంతో నచ్చిందని కృతి సనన్‌(Kriti Sanon) పేర్కొంది. ‘ఆదిపురుష్‌’ కేవలం సినిమా మాత్రమే కాదని ఒక విజువల్‌ వండర్‌ అని తెలిపింది. ఇలాంటి సినిమాలు పిల్లలకూ ఎంతో నచ్చుతాయని చెప్పింది. రామానంద్‌ సాగర్‌ రామాయణాన్ని చూడలేదని పేర్కొన్న కృతి.. ఆదిపురుష్‌ సినిమా చూశాక పిల్లల్లో రామాయణంపై అవగాహన పెరుగుతుందని తెలిపింది.  అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌, రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఈ సినిమా టీజర్‌కు కొన్ని విమర్శలు ఎదురవ్వడంతో మరోసారి వీఎఫ్‌ఎక్స్‌ పనులపై చిత్రబృందం దృష్టి సారిస్తోంది.

ఇటీవలే ‘భేడియా’(Bhediya) చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ కార్తీక్‌ ఆర్యన్‌కు జోడీగా ‘షెహ్‌జాదా’(Shehzada) చిత్రంతో అలరించనుంది. ఇది తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అలవైకుంఠపురములో..’కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. రోహిత్‌ ధావన్‌(Rohit Dhawan) దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అల్లు అరవింద్‌, భూషణ్‌ కుమార్‌, అమన్‌గిల్‌ నిర్మించారు. అటు ప్రభాస్‌ కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని