Kriti Sanon: పాత్ర లోతెంతో చూస్తా
కృతి సనన్ కథానాయికగా నటించిన ‘భేడియా’ ఈమధ్యే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో డాక్టర్ అనికా పాత్రతో వైవిధ్యమైన, గుర్తుండిపోయే నటన ప్రదర్శించిందని విమర్శకులతో సహా అంతా ఆమెను ప్రశంసిస్తున్నారు.
కృతి సనన్ (Kriti Sanon) కథానాయికగా నటించిన ‘భేడియా’ ఈమధ్యే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో డాక్టర్ అనికా పాత్రతో వైవిధ్యమైన, గుర్తుండిపోయే నటన ప్రదర్శించిందని విమర్శకులతో సహా అంతా ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ సంతోషాన్ని ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది కృతి. ఈ సందర్భంగా ‘భేడియా’ (Bhediya) చిత్ర షూటింగ్ వీడియోని జత చేసింది. ఇందులో ‘ఒక్కోసారి సినిమాలో నా పాత్ర నిడివి ఎంత ఉంది. చివరిదాకా కనిపిస్తానా? లేదా? అని ఆలోచించను. దాని లోతు, ప్రాముఖ్యం ఏంటో మాత్రమే ఆలోచిస్తాను. డాక్టర్ అనికా పాత్ర సైతం అలాంటి క్లిష్టమైన, నటనకు అవకాశం ఉన్నదే. అనికా ఏ ప్రశ్నకు సమాధానం చెప్పదుగానీ.. మీరు మాత్రం నాకు అన్ని సమాధానాలు చెప్పారు’ అంటూ దర్శకుడు అమర్‌కౌశిక్‌ని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. కథానాయకుడు వరుణ్ ధావన్ సైతం ఈ వీడియోలో కృతి నటనని పొగడ్తల్లో ముంచెత్తాడు. కృతి పాత్ర సినిమా పెద్ద ఎసెట్ అని మెచ్చుకున్నాడు. ఆమె నటించిన ‘గణపత్’, ‘షెహ్‌జాదా’ సినిమాలు ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు