Kriti Sanon: ఆ హీరోతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కృతి సనన్
తాజాగా ‘భేడియా’ సినిమాతో అలరించింది కృతి సనన్(Kriti Sanon). ఈ అమ్మడు ఓ స్టార్ హీరో సినిమాలో నటించనుందనే వార్త ప్రచారం అవుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది కృతి.
హైదరాబాద్: తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది కృతి సనన్ (Kriti Sanon). టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరస ఆఫర్లు అందుకుంటోంది. గ్లామర్ పాత్రలతో పాటు కుటుంబ కథాచిత్రాల్లోనూ నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతోంది. కొన్నిరోజుల నుంచి ఈ అమ్మడు గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. షాహిద్ కపూర్(Shahid Kapoor)తో కృతి సనన్ ఆడిపాడనుందని అనుకుంటున్నారు బీ టౌన్ ప్రేక్షకులు.
తాజాగా ఈ విషయంపై కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. తాను షాహిద్ కపూర్‌తో కలిసి నటించనున్నట్లు తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తానని చెప్పింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా ‘షెహ్‌జాదా’(Shehzada) చిత్రంలో నటిస్తోంది. ఇది తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అలవైకుంఠపురములో..’కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అల్లు అరవింద్, భూషణ్ కుమార్, అమన్‌గిల్ నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ (Adipurush)లో నటిస్తోంది కృతి. రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో రూపొందుతోన్న చిత్రమిది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli-RCB: విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్ చోప్రా
-
World News
US Visa: బిజినెస్, పర్యాటక వీసాపైనా ఇంటర్వ్యూలకు హాజరవ్వొచ్చు
-
Movies News
Nagababu: ‘ఆరెంజ్’ రీ రిలీజ్.. వసూళ్ల విషయంలో నాగబాబు వినూత్న నిర్ణయం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో మరో ఇద్దరికి అధిక మార్కులు.. సిట్ దర్యాప్తులో వెల్లడి
-
India News
Vijay Mallya: అప్పు చెల్లించకుండా.. విదేశాల్లో మాల్యా ఆస్తులు కొనుగోలు: సీబీఐ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు