Adipurush: ‘ఆదిపురుష్‌’లో చాలా ఉంది

‘‘ఆదిపురుష్‌’లో చెప్పాల్సింది చాలా ఉంది. బయటికి వచ్చింది ఒక నిమిషం 35 సెకన్ల టీజర్‌ మాత్రమే. దీంతోనే పూర్తి కథ అయిపోదు. దర్శకుడు ఓం రౌత్‌ అదేపనిలో ఉన్నారు. దీనికి కొంత సమయం కావాలి’ అంది కథానాయిక కృతి సనన్‌.

Updated : 20 Nov 2022 09:30 IST

‘‘ఆదిపురుష్‌’లో (Adipurush) చెప్పాల్సింది చాలా ఉంది. బయటికి వచ్చింది ఒక నిమిషం 35 సెకన్ల టీజర్‌ మాత్రమే. దీంతోనే పూర్తి కథ అయిపోదు. దర్శకుడు ఓం రౌత్‌ అదేపనిలో ఉన్నారు. దీనికి కొంత సమయం కావాలి’ అంది కథానాయిక కృతి సనన్‌ (Kriti Sanon). ప్రభాస్‌ (Prabhas), కృతి సనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇటీవల విడుదలైన టీజర్‌లోని దృశ్యాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ నాసిరకంగా ఉన్నాయని కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. దర్శకుడిని విమర్శిస్తున్నారు. ‘భేడియా’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఉన్న కృతి దీనిపై స్పందిస్తూ శనివారం ఆ విధంగా మాట్లాడింది. ‘ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగం అవుతున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం. మన చరిత్ర, ఇతిహాసాలను ప్రపంచం ముందు ఉంచేలా భారీ కాన్వాసుపై తీర్చిదిద్దుతున్నారాయన. దీంట్లో లోపాలు వెతక కుండా సరైన రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలి. ఓం అత్యుత్తమం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. దృశ్యాల నాణ్యతపై విమర్శలు రావడంతో నిర్మాతలు భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌లు సినిమాకి మళ్లీ కొత్త గ్రాఫిక్స్‌ని చేయిస్తున్నారు. దీంతో విడుదల తేదీ వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్‌ 16కి మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని