Adipurush: ‘ఆదిపురుష్‌’ న్యూ అప్‌డేట్‌.. రాముడి రాకకై సీతమ్మ ఎదురుచూపు

‘ఆదిపురుష్‌’ (Adipurush) నుంచి సరికొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి.

Published : 29 Apr 2023 08:42 IST

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ (Prabhas) రాముడి పాత్రలో నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓం రౌత్‌ దర్శకుడు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ (Kriti Sanon) కీలకపాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి శనివారం ఉదయం కొత్త పోస్టర్లు, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో సీతమ్మగా కృతిసనన్‌ ఆకట్టుకునేలా ఉన్నారు. లంకలో ఉన్న ఆమె రాముడి రాక కోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు కనిపించారు. అలాగే, హనుమంతుడితో కలిసి శ్రీరాముడు లంకకు పయనమైనట్లు చూడొచ్చు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. టీ-సిరీస్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 16న విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది. కొత్త పోస్టర్లు, లిరికల్‌ సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని