Kriti Sanon: ‘ఆదిపురుష్‌’ దాన్ని నేనస్సలు ఊహించలేదు.. ఎంతో బాధపడ్డా: కృతిసనన్‌

నటుడు ప్రభాస్‌ (Prabhas) రాముడి పాత్రలో నటించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush).  ఓంరౌత్‌ దర్శకుడు. ఈ ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Published : 10 Feb 2023 17:48 IST

ముంబయి: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas)‌, నటి కృతిసనన్ ‌(Kriti Sanon) జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించారు. విజయదశమి పురస్కరించుకుని గతేడాది ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రియుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై తాజాగా నటి కృతిసనన్‌ స్పందించారు.

తమ సినిమా టీజర్‌కు ఇలాంటి నెగెటివ్‌ రెస్పాన్స్‌ను తాను అస్సలు ఊహించలేదని తెలిపారు. ‘‘మా సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఈ విధమైన స్పందన వస్తోందని నేను అనుకోలేదు. నెగెటివ్‌ కామెంట్స్‌ విని ఎంతో బాధపడ్డా. ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలను చిత్రబృందం విని.. అందుకు అనుగుణంగా మార్పులు చేస్తోంది’’ అని ఆమె వివరించారు.

భారీ బడ్జెట్‌తో ఓంరౌత్ దీన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌.. రాముడిగా, కృతిసనన్‌.. సీత పాత్రలో నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషించారు. ప్రేక్షకుల కోరిక మేరకు గతేడాది ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్‌, కృతిసనన్‌ లుక్స్‌ బాలేవని, సైఫ్‌ అలీఖాన్‌ ధరించిన వస్త్రాలు, ఆయన లుక్స్‌ను తప్పుబట్టారు. గ్రాఫిక్స్‌ కూడా సరిగ్గా చేయలేదని వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని