Adipurush: ‘ఆదిపురుష్‌’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), కృతిసనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). తాజాగా ఈ సినిమా గురించి కృతి సనన్‌ మాట్లాడింది.

Updated : 29 May 2023 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) రాముడి పాత్రలో నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్‌ (Kriti Sanon) కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఐఫా అవార్డ్స్‌లో పాల్గొన్న కృతి ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. 

‘‘ఆదిపురుష్‌’ ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని తరాల వాళ్లు.. ముఖ్యంగా పిల్లలు ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలి. మన చిన్నతనంలో రామాయణం, మహా భారతాల్లోని కథలు మన అమ్మ, అమ్మమ్మలు చెబుతుంటే విన్నాం. వాటిని సినిమాగా చూస్తే పిల్లలపై మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ విజువల్‌ వండర్‌ త్రీడీలో అలరిస్తుంది. కాబట్టి వాళ్లంతా కొత్త అనుభూతిని పొందుతారు. పిల్లలతో పాటు నేటి యువతకు కూడా ఈ చిత్రం కనెక్ట్‌ అవుతుంది. ఆదిపురుష్‌ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘జై శ్రీరామ్‌’ పాట మారుమోగుతోంది. నేను ఈ సినిమాలోని రెండో పాట కోసం ఎదురుచూస్తున్నాను. అది నాకెంతో ఇష్టమైన పాట. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది’’ అని కృతి సనన్‌ చెప్పింది.

ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ‘ఆదిపురుష్‌’ (Adipurush) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ కూడా ప్రారంభించింది. జూన్‌ 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని