Kriti Sanon: ప్రేమ కథా చిత్రాలంటే ఇష్టం.. అలాంటి వాటిల్లో నటించాలని ఉంది: కృతి సనన్‌

నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ కృతి సనన్‌ (Kriti Sanon). తనకు ప్రేమ కథా చిత్రాలంటే ఇష్టమని తెలిపింది. 

Updated : 17 Feb 2023 16:01 IST

హైదరాబాద్‌:  బాలీవుడ్‌లో వరుసగా స్టార్‌ హీరో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది కృతి సనన్ (Kriti Sanon)‌. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమాలో నటిస్తోంది. ప్రభాస్‌ (Prabhas) అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి తాజాగా ఈ అమ్మడు ముచ్చటించింది.

ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తునట్లు తెలిపిన కృతి..‘‘ఆదిపురుష్‌’ సినిమా జూన్‌ 16న విడుదలవుతుంది. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం అందరికీ రాదు. నేను ఇందులో నటించినందుకు గర్వంగా భావిస్తున్నాను. సినిమా చూశాక దేశమంతా అలాగే భావిస్తుంది’’ అని అన్నారు. ఇక లవ్‌స్టోరీ సినిమాల గురించి మాట్లాడిన కృతి.. తనకు అలాంటి సినిమాలంటే ఇష్టమని తెలిపింది. ‘‘నేను స్వచ్ఛమైన ప్రేమకథను చేయాలనుకుంటున్నాను. ఆ జానర్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలకు నేను బాగా సరిపోతానని నా అభిప్రాయం’’ అని పేర్కొంది.

ఇక ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్‌కు జోడీగా కృతి నటించిన ‘షెహ్‌జాదా’(Shehzada) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అలవైకుంఠపురములో..’కి రీమేక్‌గా తెరకెక్కింది. రోహిత్‌ ధావన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అల్లు అరవింద్‌, భూషణ్‌ కుమార్‌, అమన్‌గిల్‌ నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు