Kriti Sanon: ఛాన్స్‌ వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా: కృతిసనన్‌

‘ఆదిపురుష్‌’తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు నటుడు ప్రభాస్‌, నటి కృతిసనన్‌. ఈ సినిమా కోసం మొదటిసారి కలిసి పనిచేశారు ఈ జంట. ఈనేపథ్యంలోనే ప్రభాస్‌పై తన అభిమానాన్ని బయటపెట్టారామె.

Published : 26 Nov 2022 13:37 IST

ముంబయి: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush) కోసం మొదటిసారి ప్రభాస్‌తో (Prabhas) కలిసి పనిచేశారు నటి కృతిసనన్ (Kriti Sanon)‌. దేశవ్యాప్తంగా అభిమానులున్న డార్లింగ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో ఆమె బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

‘ఆదిపురుష్‌’ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతోనే కృతిసనన్‌కు ఫేమ్‌ మరింత పెరిగింది. దీంతో ఆమె గతేడాది వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘‘అవకాశం వస్తే ప్రభాస్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తిక్‌ ఆర్యన్‌.. వీళ్లల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్‌ కూడా?’’ అని విలేకరి కృతిని ప్రశ్నించింది. ‘‘కార్తిక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌,  టైగర్‌తో డేటింగ్‌ చేస్తా. ఇక, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా’’ అని ఆమె బదులిచ్చింది.

మరోవైపు, ‘తోడేలు’ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ గురించి కృతి మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్‌ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈసినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు