Kriti Sanon: ఆ స్టార్ హీరోతో నేను ప్రేమలో లేను: కృతిసనన్
బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ పేరు గత కొన్నిరోజుల నుంచి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉందంటూ ఆంగ్ల పత్రికల్లోనూ వరుస కథనాలు దర్శనమిచ్చాయి. ఆవార్తలపై తాజాగా ఆమె స్పందించారు.
ముంబయి: ఓ స్టార్ హీరోతో తాను ప్రేమలో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. ‘‘ఇది ప్యార్ లేదా ప్రచారం కాదు. ఆ రియాల్టీ షోలో మన భేదియా (వరుణ్ ధావన్) కాస్త అత్యుత్సాహం కనబరిచాడు. అతడు సరదాగా అన్న మాటలు ఇప్పుడు ఎన్నో వార్తలకు నాంది పలికినట్లు అయ్యింది. కొన్ని వెబ్‌సైట్లు నా వివాహ తేదీనీ ప్రకటించడానికి ముందే వీటికి నేను ఫుల్‌స్టాప్ పెడుతున్నా. వాటిల్లో ఎలాంటి నిజం లేదు’’ అని ఆమె క్లారిటీ ఇచ్చారు.
‘భేదియా’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్, కృతిసనన్ ఇటీవల ఓ బీటౌన్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో కృతితో ప్రేమలో ఉన్నారంటూ ఆ షోలో వరుణ్ వ్యాఖ్యలు చేశాడు. ‘‘కృతిసనన్ పేరు నా జాబితాలో లేదు. ఎందుకంటే ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో కలిసి షూట్‌లో ఉన్నాడు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు నెటిజన్లు వరుణ్ మాట్లాడుతున్నది ప్రభాస్ గురించేనని భావించారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సినిమా ప్రమోషన్స్ కోసం మా హీరోను ఎందుకు ఇలాంటి వాటిల్లోకి లాగుతున్నారు’ అని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కృతి క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రభాస్-కృతిసనన్ కలిసి నటించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
INDW vs SAW: ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్ ఓటమి..
-
Technology News
Coca Cola Phone : కోలా ఫోన్ కాదు.. కోకాకోలా స్పెషల్ ఎడిషన్.. ఫీచర్లివే!
-
Politics News
BJP: భాజపా కీలక నిర్ణయం.. సీఎంపై పోటీకి మాజీ మిలిటెంట్ నేత
-
Sports News
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని వీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandrababu: వైఎస్ వివేకా హత్య.. జగన్ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు