Updated : 05/12/2021 11:05 IST

KTR: గతంలో అండగా ఉన్నాం.. ఇప్పుడూ ఉంటాం

కందికొండ కుమార్తె లేఖపై స్పందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని వెల్లడించారు. ఆయన కుటుంబం విషయంలో తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసానితో మాట్లాడి సాయం చేస్తారని పేర్కొన్నారు.

కొన్ని నెలల కిందట కందికొండ తీవ్ర అనారోగ్యానికి గురై పలుమార్లు ఆస్పత్రిలో చేరగా.. మంత్రి కేటీఆర్‌ ఆయనకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాతృక ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చిత్రపురి కాలనీ లేదా, ఇంకెక్కడైనా నివాసం కల్పించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. తాజాగా ట్విటర్‌ వేదికగా లేఖపై స్పందించిన కేటీఆర్‌ కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తెలుగు సినీ గేయ రచయితగా కందికొండకు మంచి పేరుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లి కూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఆ తర్వాత ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని