ఉత్కంఠగా ‘కుడి ఎడమైతే’ టీజర్‌

‘మీకు ఎప్పుడైనా జీవితంలో జరిగిందే మళ్లీ మళ్లీ జరిగినట్లు అనిపించిందా? దేవుడ్ని నమ్ముతావా.. అలాగే ఇది కూడా. మీకూ అనుభవం అయితేనే మీరూ నమ్ముతారు’ అని అంటున్నారు నటి అమలా పాల్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం....

Published : 03 Jul 2021 14:40 IST

హైదరాబాద్‌: ‘మీకు ఎప్పుడైనా జీవితంలో జరిగిందే మళ్లీ మళ్లీ జరిగినట్లు అనిపించిందా? దేవుడ్ని నమ్ముతావా.. అలాగే ఇది కూడా. అనుభవం అయితేనే మీరూ నమ్ముతారు’ అని అంటున్నారు నటి అమలా పాల్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కుడి ఎడమైతే’. క్రైమ్‌, సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పవన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ఈ నెల 16న ‘కుడి ఎడమైతే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో శనివారం టీజర్‌ను చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ఇందులో అమలాపాల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. నటుడు రాహుల్‌ విజయ్‌ కీలకపాత్ర పోషించారు. ‘యూ టర్న్‌’, ‘లూసియా’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్లను ప్రేక్షకులకు అందించి ఇప్పటికే దర్శకుడిగా పవన్‌కుమార్‌ మంచి మార్కులు కొట్టేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని