Kushboo Sundar: మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
తన తండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని సినీనటి ఖుష్బూ(Kushboo) సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల వయసులోనే తాను వేధింపులకు గురైనట్లు తెలిపారు.
ఇంటర్నెట్‌డెస్క్: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Kushboo) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఒక అబ్బాయి లేదా అమ్మాయి చిన్నతనంలో వేధింపులకు గురైతే.. అది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది. తన భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే.. ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం’’ అని ఖుష్బూ వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..