Kushi: ‘BSNL’ ఉద్యోగిగా విజయ్ దేవరకొండ.. ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘ఖుషి’ పోస్టర్
‘ఖుషి’ సినిమా కొత్త విడుదల తేదీ గురువారం ఖరారైంది. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్‌ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. సెప్టెంబరు 1న విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్.. విజయ్- సమంత అభిమానులు, సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. ఓ భవనంపై ఉన్న సమంత.. కింద నిల్చొన్న విజయ్ దేవరకొండ చేయిని పట్టుకుని కనిపించింది. నాయికానాయికలు చిరునవ్వు చిందిస్తూ క్యూట్‌గా ఉన్నారు. మరో చేత్తో సమంత కుక్క పిల్లను, విజయ్ లంచ్ బాక్స్ పట్టుకుని ఉండడం ఆసక్తి రేకెత్తించేలా ఉంది. విజయ్ ధరించిన ఐడీ కార్డుని బట్టి ఆయన ఈ సినిమాలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ (BSNL) ఉద్యోగిగా నటిస్తున్నారని అర్థమవుతోంది. ‘వావ్.. మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌తో కూడిన కథ అనుకుంటా’, ‘విజయ్ క్లాస్ లుక్ అదిరింది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2022 మేలో ఈ చిత్ర టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తూ దర్శక, నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. అప్పుడే.. ఈ సినిమా కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతున్నట్టు తెలిసింది. తాజా పోస్టర్‌లోనూ ఆ ఛాయలు కనిపించాయి. గతేడాది క్రిస్మస్‌కే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉన్నా సమంత అనారోగ్యానికి గురికావడంతో చిత్రీకరణ వాయిదా పడింది. ఇటీవల పునఃప్రారంభమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్