F3: ‘ఎఫ్‌ 3’ డబ్బు గీతం.. ఫుల్‌ వీడియో వచ్చేసింది!

డబ్బు ఇతివృత్తంగా హాస్య నేపథ్యంలో తెరకెక్కి ఇటీవల విడుదలై, మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని ఫుల్‌ వీడియోలు విడుదలకాగా తాజాగా ‘లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ డబ్బు’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ అయింది.

Updated : 07 Dec 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బు, ఫ్రస్టేషన్‌ ఇతివృత్తంగా హాస్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 3’ (F3). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని సాంగ్స్‌ ఫుల్‌ వీడియోలు విడుదల కాగా తాజాగా ‘లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ డబ్బు...’ (Lab Dab Dabboo) ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ అయింది. డబ్బున్న వారినే ప్రపంచం గుర్తిస్తుంది.. ఆ డబ్బుంటే ప్రపంచమే జేబులోకి వస్తుందంటూ సరదాగా సాగుతూనే ఆలోచింపజేసే ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. రామ్‌ మిర్యాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ పాట లిరికల్‌ వీడియోకు మంచి స్పందన రాగా ఫుల్‌ వీడియో అదే బాటలో దూసుకెళ్లేలా ఉంది. ఈ వీడియోలో వెంకటేశ్‌ (Venkatesh), వరుణ్‌ (Varun Tej) హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

‘ఎఫ్‌ 2’కు కొనసాగింపుగా ‘ఎఫ్‌ 3’ రూపొందిన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌, సునీల్‌, సోనాల్‌ చౌహాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ ‘సమ్మర్ సోగ్గాళ్లు’ ధనం గురించి ఏం ఉపదేశం ఇచ్చారో వినేయండి, పనిలోపనిగా చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని