ఆ ఒక్క సీన్‌ కోసం రైల్లోనే పదిరోజులు: లైలా

కోలీవుడ్‌ విలక్షణ దర్శకుడు బాలా తెరకెక్కించిన ‘పితామగన్‌’(తెలుగులో ‘శివపుత్రుడు’)ఎంతటి సూపర్‌హిట్టో అందరికి తెలిసిందే. ముఖ్యంగా చియాన్‌ విక్రమ్‌ నటించిన తీరు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే మిగతా నటీనటులైన సూర్య, లైలా, సంగీత

Published : 21 Mar 2021 16:23 IST

చెన్నై: కోలీవుడ్‌ విలక్షణ దర్శకుడు బాలా తెరకెక్కించిన ‘పితామగన్‌’(తెలుగులో ‘శివపుత్రుడు’)ఎంతటి సూపర్‌హిట్టో అందరికి తెలిసిందే. ముఖ్యంగా చియాన్‌ విక్రమ్‌ నటించిన తీరు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే మిగతా నటీనటులైన సూర్య, లైలా, సంగీత అద్భుతంగా నటించారు. తాజాగా ఈ సినిమాపై నటి లైలా ఒక ట్వీట్‌ చేసింది. చెన్నై కేటీవీలో మధ్యాహ్నం ఒంటిగంటకు ‘పితామగన్‌’  ప్రసారం చేశారని, ఆ సినిమా చూస్తుంటే నాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూర్య కాంబినేషన్‌లో రైల్లో వచ్చే సరదా సన్నివేశాల కోసం పదిరోజుల పాటు రైళ్లలోనే తిరిగామని చెప్పుకొచ్చింది. తేని పరిసర ప్రాంతాల్లోని రైల్వే రూట్లలో ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌కు వెళ్తూ  షూటింగ్‌ చేసినట్టు తెలిపింది. మీరు కూడా సినిమా చూడండంటూ అభిమానులను కోరింది. 
 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు