Laksh Chadalavada: అలాంటి పాత్రలే నా లక్ష్యం

‘‘రాజమౌళి సినిమాల్లో విలన్‌.. శ్రీను వైట్ల చిత్రాల్లో హీరో.. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’లో నా పాత్ర అలా ఉంటుంది.

Updated : 24 Jun 2022 08:05 IST

‘‘రాజమౌళి సినిమాల్లో విలన్‌.. శ్రీను వైట్ల చిత్రాల్లో హీరో.. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’లో(Gangster Gangaraju) నా పాత్ర అలా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే చిత్రమిది’’ అన్నారు లక్ష్ చదలవాడ(Laksh Chadalavada). ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఇషాన్‌ సూర్య తెరకెక్కించారు. చదలవాడ శ్రీనివాసరావు నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు హీరో లక్ష్.
* ‘‘నేను గతంలో ఓ నాలుగు సినిమాలు చేశా. తర్వాత కొన్నేళ్లు గ్యాప్‌ తీసుకొని లాక్‌డౌన్‌కు ముందు ‘వలయం’ (Valayam) అనే సినిమా చేశా. ఆ వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కించా. అయితే కొవిడ్‌ పరిస్థితుల వల్ల ఈ సినిమా మేమనుకున్న దానికన్నా కాస్త ఆలస్యమైంది. అందుకే మళ్లీ గ్యాప్‌ వచ్చినట్లయింది’’.
*‘‘ఇదొక చక్కటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. కుటుంబంతో కలిసి చూడగలిగేలా ఉంటుంది. ఈ కథ మొత్తం దేవరలంక అనే ఓ ఫిక్షనల్‌ టౌన్‌లో జరుగుతుంటుంది’’.
*‘‘నా గత చిత్రాల్లో వయసుకు మించిన పాత్రలు.. మరీ మాస్‌ పాత్రలు చేశా. ఇకపై నాకంటూ ఓ గుర్తింపు తెచ్చే పాత్రలే చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. నన్ను నేను కొత్తగా చూపించేందుకు కఠిన కసరత్తులు చేసి, 25కేజీలు బరువు తగ్గా.  ప్రస్తుతం ‘ధీర’ (Dheera) అనే సినిమా చేస్తున్నా. అదొక రోడ్‌ జర్నీ సినిమా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని