Vijay: సంక్రాంతి బరిలో

రానున్న సంక్రాంతి కోసం పలు సినిమాలు ముస్తాబవుతున్నాయి. విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వారసుడు’  సంక్రాంతికే విడుదల కానుంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి నిర్మాణ సంస్థలు. వంశీ పైడిపల్లి దర్శకత్వం

Updated : 26 Sep 2022 12:04 IST

రానున్న సంక్రాంతి కోసం పలు సినిమాలు ముస్తాబవుతున్నాయి. విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వారసుడు’  సంక్రాంతికే విడుదల కానుంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి నిర్మాణ సంస్థలు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌, పరమ్‌ వి.పొట్లూరి, పెరల్‌ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. రెండు పాటలు, రెండు పోరాట ఘట్టాలు మినహా చిత్రీకరణ పూర్తయిందని, ఆదివారం నుంచి చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైందని సినీ వర్గాలు తెలిపాయి. ‘‘విజయ్‌ని మునుపెన్నడూ చూడని పాత్రలో ఆవిష్కరించే చిత్రమిది. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం, భారీ హంగులతో కూడిన నిర్మాణంతో సినిమా రూపొందుతోంద’’ని నిర్మాతలు తెలిపారు. ప్రభు, శరత్‌కుమార్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, శ్రీకాంత్‌, శామ్‌, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.


శ్రీవిష్ణు కొత్త చిత్రం

‘వివాహ భోజనంబు’ సినిమాతో పరిచయమైన రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాజేష్‌ దండా నిర్మాత. అనిల్‌ సుంకర సమర్పకులు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు నారా రోహిత్‌ క్లాప్‌నిచ్చారు. హాస్యభరితంగా సాగే కుటుంబ కథా చిత్రమిదని, త్వరలోనే చిత్రీకరణని ప్రారంభిస్తామని సినీవర్గాలు తెలిపాయి. ప్రారంభోత్సవంలో వి.ఐ.ఆనంద్‌, విజయ్‌ కనకమేడల, ఏఆర్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, దేవిప్రసాద్‌, ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: రామిరెడ్డి, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, కళ: బ్రహ్మ కడలి, కథ: భాను ఘోవరపు, సంభాషణలు: నందు సవిరిగాన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని