Lata Mangeshkar: అధికారిక లాంఛనాలతో లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు

ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated : 06 Feb 2022 19:30 IST

ముంబయి:  ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు నడుమ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరై నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, సినీ నటులు షారూక్‌ ఖాన్‌, సినీరచయిత జావెద్‌ అక్తర్‌ తదితరులు హాజరై నివాళులర్పించారు. అంతకు ముందు ముంబయిలోని లతాజీ ఇంటి వద్ద ఆమె పార్థివ దేహంపై జాతీయ పతాకాన్ని కప్పి సైనిక వందనం సమర్పించారు. లతా మంగేష్కర్‌కు ముంబయి వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని