
Updated : 11 Jan 2022 15:34 IST
Lata mangeshkar:ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా
ముంబయి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా సోకింది. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సమీప బంధువు రచ్నా మీడియాకు వెల్లడించారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌కు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
‘‘లతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె వయస్సు దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మా గోప్యతను గౌరవించండి. ఆమె కోసం ప్రార్థించండి’ అని రచ్నా కోరారు.
కరోనా వైరస్ మొదటి దశలో కూడా లతా మంగేష్కర్‌కు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందారు. తన వ్యక్తిగత వైద్యులు, నర్సులు చెప్పిన సూచనలు కళ్లుమూసుకొని అనుసరించినట్లు అప్పట్లో ఆమె వెల్లడించారు.
Tags :