Lata Mangeshkar: శాస్త్రోక్తంగా లతా మంగేష్కర్‌ అస్థికలు నిమజ్జనం

గాన కోకిల, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ లెజెండరీ గాయిని అస్థికలను ఆమె కుటుంబ సభ్యులు.....

Updated : 10 Feb 2022 17:45 IST

నాసిక్‌: గాన కోకిల, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ లెజెండరీ గాయిని అస్థికలను ఆమె కుటుంబ సభ్యులు గురువారం నిమజ్జనం చేశారు. లతా మంగేష్కర్‌ సోదరి ఉషా మంగేష్కర్‌, ఆమె మేనల్లుడు అదినాథ్‌ మంగేష్కర్‌, ఇతర కుటుంబ సభ్యులు నాసిక్‌లోని పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న రామ్‌కుంద్‌లో ఈరోజు ఉదయం 10గంటల సమయంలో శాస్త్రోక్తంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషా మంగేష్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. లతా తనకు కేవలం సోదరి కాదు.. అమ్మ అన్నారు. కర్మకాండలన్నీ శుభముహూర్తంలో జరిగాయని తెలిపారు. 

మరోవైపు, తామెంతగానో అభిమానించే మెలోడీ క్వీన్‌కు నివాళులర్పించేందుకు అనేకమంది నాసిక్‌ వాసులు  ఘాట్‌ వద్దకు తరలివచ్చారు. లతా మంగేష్కర్‌ అస్థికల నిమజ్జనం కార్యక్రమాన్ని నాసిక్‌ పురోహితుల సంఘం అధ్యక్షుడు సతీశ్‌ శుక్లా జరిపారు. ఈ కార్యక్రమంలో నాసిక్‌ పురపాలక కమిషనర్‌ కైలాస్‌ జాదవ్‌, స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని