
Romantic New Trailer: ‘రొమాంటిక్’ కొత్త ట్రైలర్.. అదరగొట్టిన ఆకాశ్ పూరీ
హైదరాబాద్: పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నటుడు ఆకాశ్ పూరీ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘రొమాంటిక్’ నుంచి ఓ సరికొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది.
‘రొమాంటిక్ బ్యాడ్ యాస్’గా విడుదలైన ఈ ట్రైలర్లో ఆకాశ్ పూరీ రోల్ గురించి కొంతవరకూ చూపించారు. ‘‘మై నేమ్ ఈజ్ వాస్కోడిగామా.. ఏక్ దిన్ యే బచ్చా.. సబ్ కా బాప్ బనేగా’’, ‘‘పుట్టింది పడుకోవడానికి కాదు. చనిపోయాక పడుకో’’ అంటూ ఆకాశ్ చెప్పే మాస్ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో రమ్య గొవార్కర్ అనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. గోవా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్యాంగ్స్టర్లు.. అందులోని ఓ కుర్రాడి ‘రొమాంటిక్’ ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, కథనం సంభాషణలు అందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.