Kushi: ‘ఖుషి’ వచ్చే ఏడాదేనా?
విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ ఏడాది కాస్త నిరాశే. ‘లైగర్’ ఊరించి ఉసూరుమనిపించింది. ఈ ఏడాది చివర్లో వస్తుందనుకుంటున్న ‘ఖుషి’ కూడా వచ్చేలా కనిపించడం లేదు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులకు ఈ ఏడాది కాస్త నిరాశే. ‘లైగర్’ ఊరించి ఉసూరుమనిపించింది. ఈ ఏడాది చివర్లో వస్తుందనుకుంటున్న ‘ఖుషి’ (Kushi) కూడా వచ్చేలా కనిపించడం లేదు. విజయ్, సమంత (Samantha) జంటగా నటించిన చిత్రమే ‘ఖుషి’. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు విజయ్. ‘‘60శాతంపైగా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబరులో అనుకున్నాం కానీ వీలు కావడం లేదు. దానికి చాలా కారణాలున్నాయి. బహుశా ఫిబ్రవరికి విడుదల చేస్తాం’’అని చెప్పినట్లు తెలిసింది. ఓ కొత్త తరహా ప్రేమ కథతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాళ్ల దగ్గర దళిత ఎమ్మెల్యే
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్