
Jabardasth: యాంకర్ ప్రశ్న.. అనసూయ వాకౌట్
వైరల్‌గా మారిన వీడియో
హైదరాబాద్: వస్త్రధారణకు సంబంధించిన ఓ యాంకర్ అడిగిన ప్రశ్నతో ఆగ్రహానికి లోనైన ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ షో నుంచి వాకౌట్ చేశారు. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’. రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి గురువారం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. కాగా, త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
హైపర్ ఆది స్కిట్లో భాగంగా యాంకర్ శివ ‘జబర్దస్త్’ స్టేజ్‌పై తళుక్కున మెరిశారు. స్కిట్ అనంతరం.. ‘అనసూయ.. ఎప్పటినుంచో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. మీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి తరచూ నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. చిన్న చిన్న దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారని అందరూ అంటుంటారు?’ అని అడిగాడు. దానికి ‘ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్లు అడిగారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ఇక్కడే ఉంటున్నారు. మీకు ఇండస్ట్రీ గురించి తెలిసి కూడా ఇలా ఎలా అడుగుతున్నారు? అయినా ఇది నా పర్సనల్’ అని సమాధానమిచ్చారు అనసూయ. ‘మీ పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవచ్చు కదా?ఇక్కడ ఎందుకని?’ శివ అనగానే.. అనసూయ ఒకింత ఆగ్రహానికి గురయి సెట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ‘జబర్దస్త్’ సెట్లో ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే వచ్చే గురువారం వరకూ వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.