Naga Chaitanya: చైతూ కోసం ఓ కథ

‘విరాటపర్వం’ సినిమాతో హృదయాల్ని కదిలించారు దర్శకుడు వేణు ఊడుగుల. తొలి సినిమా నుంచే కథ, కథనాలపై తనదైన ముద్ర వేస్తున్న దర్శకుడాయన. తదుపరి సినిమా కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. నాగచైతన్య కోసం ఓ కథని సిద్ధం

Updated : 09 Sep 2022 07:30 IST

‘విరాటపర్వం’ (Virataparvam) సినిమాతో హృదయాల్ని కదిలించారు దర్శకుడు వేణు ఊడుగుల (Venu Udugula). తొలి సినిమా నుంచే కథ, కథనాలపై తనదైన ముద్ర వేస్తున్న దర్శకుడాయన. తదుపరి సినిమా కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. నాగచైతన్య (Naga Chaitanya) కోసం ఓ కథని సిద్ధం చేసి వినిపించినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నట్టు ఫిలిం నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. అందులో వేణు ఊడుగుల కథ ఒకటి. అన్నీ కుదిరితే ఈ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.


ఎవరీ అజయ్‌?

అజయ్‌ కతుర్వార్‌ కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘అజయ్‌గాడు’ (Ajaygadu). భానుశ్రీ, శ్వేత మెహతా కథానాయికలు. చందన కొప్పిశెట్టితో కలిసి అజయ్‌ కుమార్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. ఈ సినిమా లుక్‌ని కథానాయకుడు సత్యదేవ్‌ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘‘అజయ్‌ కతుర్వార్‌ ‘విశ్వక్‌’ సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన విభిన్నమైన కథ, కథనాలతో ఈ సినిమాని తెరకెక్కించాడు. త్వరలోనే టీజర్‌ని కూడా విడుదల చేస్తాం. ఈ కథలో అజయ్‌ ఎవరు? తన లక్ష్యం కోసం ఏం చేశాడనేది కీలకం. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, మనీజేన, సుమంత్‌బాబు, ప్రతీక్, నేపథ్య సంగీతం: సిద్ధార్థ్‌ శివుని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని