Updated : 27 May 2022 08:12 IST

Cinema News: ‘వీట్లే విశేషం’ ఏమిటంటే..!

తనకు తమ్ముడు పుడుతున్నాడని తెలుసుకున్న పాతికేళ్ల యువకుడి కష్టాలను వినోదాత్మకంగా చూపించిన చిత్రం ‘బధాయీ హో’. ఆర్‌.జె బాలాజీ కథానాయకుడిగా ఈ చిత్రం తమిళంలో ‘వీట్లే విశేషం’ పేరుతో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఎన్‌.జె శర్వణన్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హీరో తల్లిదండ్రులుగా సత్యరాజ్‌, ఊర్వశి నటించారు. ట్రైలర్‌లో సత్యరాజ్‌ హావభావాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మాతృక తరహాలోనే విజయం సాధిస్తుందని ‘వీట్లే విశేషం’ బృందం నమ్మకంగా ఉంది. బోనీ కపూర్‌ బే వ్యూ ప్రాజెక్ట్స్‌, జీ స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: గిరీష్‌ గోపాలకృష్ణన్‌,  ఛాయాగ్రహణం: కార్తీక్‌ ముత్తుకుమార్‌, కూర్పు: సెల్వ ఆర్‌.కె.


‘ఉస్తాద్‌’కు క్లాప్‌.. క్లాప్‌

‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా తొలి ప్రయత్నంలోనే   విజయాన్ని అందుకొన్నారు శ్రీసింహా కోడూరి. ఇప్పుడాయన ‘ఉస్తాద్‌’గా అలరించేందుకు సిద్ధమయ్యారు. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా  నిర్మిస్తున్న చిత్రమిది. ఫణి దీప్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తం సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్‌ కొట్టగా.. పురాణ పండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.    ‘‘న్యూఏజ్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో శ్రీవల్లి, సాయి కొర్రపాటి, కాల భైరవ, వెంకటేష్‌ మహా తదితరులు పాల్గొన్నారు. సంగీతం: అకీవా.బి, ఛాయాగ్రహణం: పవన్‌ కుమార్‌ పప్పుల.


క్రైమ్‌ కామెడీకథాంశంతో..

‘సేనాపతి’ చిత్రంతో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని మెప్పించారు నరేష్‌ అగస్త్య. ఇప్పుడాయన హీరోగా వీరభద్రం చౌదరి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. నబీషేక్‌, తూము నర్సింహా పటేల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ   సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘సరికొత్త క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. వీరభద్రమ్‌ కథ వినిపించగానే మరో ఆలోచన లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాం. జులై నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. మిగతా   నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. దీనికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు.


సూర్య-బాలా చిత్రం మరో షెడ్యూల్‌

 

ర్శకుడు బాలాతో కథానాయకుడు సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి కథా   నాయిక. ‘సూర్య 41’ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయింది. బాలా, సూర్య మధ్య విభేదాలు వచ్చి ఈ సినిమా ఆగిపోయిందని కొన్ని రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ అనుమానాలకు సూర్య తాజాగా చెక్‌ పెట్టాడు. బాలాతో కలిసి ఉన్న ఫొటోను జత చేస్తూ త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగానే గోవాలో తదుపరి షెడ్యూల్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని