Tollywood: లచ్చి గాని పెళ్లి.. పార్శి గుట్టల లొల్లి

సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకుడు. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలోని ‘‘లచ్చి గాని పెళ్లి.. ఇగ పార్శి గుట్టల లొల్లి’’ గీతాన్ని హీరో రవితేజ తాజాగా విడుదల చేశారు.

Updated : 23 Sep 2022 06:58 IST

సంజయ్‌ రావు (Sanjay Rrao), ప్రణవి (Panavi) మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ (Slumdog Husband). ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకుడు. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలోని ‘‘లచ్చి గాని పెళ్లి.. ఇగ పార్శి గుట్టల లొల్లి’’ గీతాన్ని హీరో రవితేజ తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో స్వరాలందించడమే కాక స్వయంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. ‘‘మంచి వినోదాత్మక కథతో సాగే ఎంటర్‌టైనర్‌ ఇది.  త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


అభిమన్యుణ్నికాదు.. అర్జునుడ్ని!

ఆదర్శ్‌ (Aadarsh), చిత్ర శుక్లా, రూపేష్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో ఆంథోని మట్టిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గీతా సాక్షిగా’ (GeetaSakshigaa). చేతన్‌ రాజ్‌ నిర్మాత. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భరణి శంకర్‌, జయలలిత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌లో అదర్శ్‌ నేరస్థుడిగా కనిపించారు. ‘‘పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుణ్ని కాదు.. వాడి బాబు అర్జునుణ్ని రా’’ అంటూ టీజర్‌లో ఆదర్శ్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తిరేకెత్తించింది. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది’’ అని నిర్మాత చెప్పారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని