Cinema News: అమలాపాల్.. ‘ద్విజ’
ఓవైపు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తూనే.. మరోవైపు పరిమిత బడ్జెట్లో ప్రయోగాత్మక చిత్రాలూ నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇప్పుడీ సంస్థలో అమలాపాల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మితమవుతోంది.
ఓవైపు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తూనే.. మరోవైపు పరిమిత బడ్జెట్లో ప్రయోగాత్మక చిత్రాలూ నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇప్పుడీ సంస్థలో అమలాపాల్ (Amala Paul) ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మితమవుతోంది. ఐజాజ్ ఖాన్ దర్శకుడు. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్, విఆర్సీసీ ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సినిమాకి ‘ద్విజ’ (Dvija) అనే టైటిల్ ఖరారు చేశారు. ఇటీవలే చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. స్త్రీ విముక్తికి సంబంధించిన శక్తిమంతమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. సంఘంలోని అసమానతలకు వ్యతిరేకంగా ఓ మహిళ చేసే పోరాట గాథగా సాగుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగులోకి మరో కొత్త అందం
సత్యదేవ్, ధనంజయ కథానాయకులుగా ఈశ్వర్ కార్తీక్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఇందులో ఓ నాయికగా ప్రియా భవానీ శంకర్‌ను (Priya Bhavani Shankar) ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రచార చిత్రంలో ప్రియాను చూపించిన తీరును బట్టి.. ఇందులో ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా. విభిన్నమైన యాక్షన్ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంగీతం: చరణ్ రాజ్, కూర్పు: అనిల్ క్రిష్, ఛాయాగ్రహణం: మణికంఠన్ కృష్ణమాచారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా