Cinema News: సినీ ముచ్చట్లు.. కొత్త సినిమా విశేషాలు
తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో స్వప్న చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘నమస్తే సేట్ జీ’ (Namaste SetJi). డిసెంబర్ 9న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైజాగ్‌లో ‘నమస్తే సేట్ జీ’ టీమ్ సందడి
తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో స్వప్న చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘నమస్తే సేట్ జీ’ (Namaste SetJi). డిసెంబర్ 9న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ టూర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం వైజాగ్‌లో టీమ్ సందడి చేసింది. విశాఖ 32 డివిజన్ కార్పొరేటర్ కందుల నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. లాక్డౌన్లో జరిగిన కథలను ఆధారంగా చేసుకుని కిరాణా షాపు నడిపే వ్యక్తుల జీవనవిధానాన్ని చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆయన అన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకుల్ని కోరారు. తమ సినిమాను ఆదరించాలని నటీనటులు కోరారు. అనంతరం నాగరాజు పుట్టినరోజుని పురస్కరించుకుని టీమ్ సెలబ్రేట్ చేసింది.
ఓటీటీలో విస్ఫోట్
‘ప్రేమ్ అగ్గన్’, ‘ఖుషీ’, ‘ఫిదా’, ‘డార్లింగ్’ చిత్రాలతో మెప్పించిన హీరో ఫర్దీన్‌ఖాన్ (Fardeen Khan). చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్దీన్ ‘విస్ఫోట్’తో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్ మరో కథానాయకుడు. కుకీ గులాటీ దర్శకుడు. భారీ యాక్షన్ చిత్రంగా ముస్తాబవుతున్న ఈ ఫిల్మ్ వచ్చే ఏడాది ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు నిర్మాత సంజయ్ గుప్తా మంగళవారం తెలిపారు. ‘ముందు థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నాం. బాక్సాఫీస్ పరిస్థితులు బాగా లేనందున ఓటీటీకి వెళ్తున్నాం’ అని సంజయ్ గుప్తా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది వెనిజులా చిత్రం ‘రాక్ పేపర్ సిసర్స్’ ఆధారంగా రూపొందుతోంది. ప్రియా బాపట్, క్రిస్టల్ డిసౌజా ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
‘భూల్ భులయ్యా 2’ దర్శకుడితో..
హాస్య చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు.. అనీస్ బజ్మీ. విభిన్న జానర్స్‌లో నటిస్తూ వస్తున్న కథానాయకుడు వరుణ్ ధావన్ (Varun Dhawan). మొదటిసారి ఈ ఇద్దరి కలయికలో ఓ యాక్షన్ కామెడీ చిత్రం రూపొందనుంది. ‘ఈ ఇద్దరి కలయికలో వచ్చే ఏడాది కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఇది యాక్షన్, హాస్యం కథాంశంతో తయారవుతుంది’ అని సినీవర్గాలు తెలిపాయి. అనీస్ బజ్మీ చివరిసారి ‘భూల్ భులయ్యా 2’తో భారీ విజయం అందుకోగా.. వరుణ్ ధావన్ ‘భేడియా’తో ఆకట్టుకున్నాడు.
తాప్సి పరిశోధన ఫలించిందా?
తాప్సి (Taapsee) ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘బ్లర్’ (BLUR). స్పానిష్ చిత్రం ‘జూలియాస్ ఐ’ ఆధారంగా అజయ్ బహల్ తెరకెక్కిస్తున్నారు. మంగళవారం చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులో తాప్సి.. గాయత్రి, గౌతమిగా ద్విపాత్రాభినయం చేస్తోంది. ఇద్దరిలో అంధురాలైన గౌతమి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రైలర్ మొదలవుతుంది. పోలీసులు, గాయత్రి భర్త దీన్ని ఆత్మహత్యగానే భావిస్తుంటారు. దీన్ని నమ్మని గాయత్రి ఇది హత్యగా భావించి సొంతంగా పరిశోధన ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో తనూ క్రమంగా కంటిచూపు కోల్పోయే దశకొస్తుంది. ఈలోపే.. ఆమె సోదరిది హత్యా.. ఆత్మహత్యా.. అని తెలుసుకుంటుందా? తర్వాత ఏం జరిగిందో.. తెరపై చూడాల్సిందే. టోనీ డిసౌజా, ప్రదీప్ శర్మ, మానవ్ దుర్గా నిర్మిస్తున్న ఈ చిత్రం జీ5 ఓటీటీలో డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఉగ్రవాదిని చంపిన కశ్మీరీ అమ్మాయిగా?
మరోసారి బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతోంది శ్రద్ధాకపూర్ (Shradha Kapoor). గతంలో దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రంలో నటించింది శ్రద్ధ. ఇప్పుడు ధైర్యవంతమైన ఓ యువతి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 2009లో ఉగ్రవాదులు తన ఇంటిపై దాడి చేసిన సమయంలో ధైర్యంగా ఓ ఉగ్రవాదిని చంపిన కశ్మీరీ అమ్మాయి రుక్సానా స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ఆ కథలో శ్రద్ధాకపూర్ నటించే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆమె ‘స్త్రీ 2’తో పాటు లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: ‘సిరివెన్నెల’ తీసేటప్పుడు చాలా ఒత్తిడికి గుర్తెన కె.విశ్వనాథ్..
-
General News
Tamilisai: పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
K Viswanath: బాల సుబ్రహ్మణ్యంకు కోపం వచ్చిన వేళ.. అలా నటుడిగా మారిన కె.విశ్వనాథ్
-
India News
Parliament: రెండోరోజూ అదానీ ఎఫెక్ట్.. వాయిదా పడిన ఉభయ సభలు
-
General News
Andhra News: వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్ ఓఎస్డీ