Dhee 14: రవికృష్ణ, నవ్యస్వామి డ్యాన్స్‌కి ప్రియమణి ఫిదా

బుల్లితెర జంట నవ్యస్వామి, రవికృష్ణ లవ్లీ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అంటూ నవ్యతో కలిసి రవి చేసిన డ్యాన్స్‌ చూస...

Published : 15 Apr 2022 01:20 IST

హైదరాబాద్‌: బుల్లితెర జంట నవ్యస్వామి, రవికృష్ణ లవ్లీ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అంటూ నవ్యతో కలిసి రవి చేసిన డ్యాన్స్‌ చూసి ప్రియమణి ఫిదా అయ్యారు. ఈ రీల్‌ కపుల్‌ మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌కి ‘ఢీ -14’ వేదికైంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో ప్రియమణి, గణేశ్‌ మాస్టర్‌, నందితా శ్వేత న్యాయ నిర్ణేతలు. తాజాగా ఈ షో సరికొత్త ప్రోమో విడుదలైంది. ఇందులో ఎప్పటిలాగానే కంటిస్టెంట్స్‌ అందరూ తమ డ్యాన్స్‌తో మెప్పించారు. ‘ఓ చెలియా’ పాటకు చిన్నారుల జోడీ చేసిన డ్యాన్స్‌ చూసి గణేశ్‌ మాస్టర్‌ మెచ్చుకున్నారు. ఇక, ప్రదీప్‌, హైపర్‌ ఆదిల కామెడీ టైమింగ్‌ ఆకట్టుకునేలా సాగింది. ఇందులో భాగంగా ‘‘రవి.. మీకు ఫస్ట్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి?’’ అని నవ్యస్వామిని ప్రదీప్‌ ప్రశ్నించగా.. ‘‘జాకెట్‌. ఒకసారి మేమిద్దరం షాపింగ్‌కి వెళ్లాం. అక్కడ ఒక జాకెట్‌ నాకు బాగా నచ్చేసింది. కానీ ఆ మోడల్‌లో నాకు సరిపడా సైజ్‌ దొరకలేదు. దాంతో కాస్త నిరాశకు గురై.. దాని గురించి మర్చిపోయాను. అలా, పది రోజులు గడిచిపోయిన తర్వాత అదే జాకెట్‌ తీసుకువచ్చి రవి నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను షాకయ్యాను. హైదరాబాద్‌లో నాకు కావాల్సిన సైజ్‌ లేదని తెలిసి.. బెంగళూరు నుంచి నాకు సరిపడే సైజ్‌లో అదే జాకెట్‌ని తీసుకువచ్చి ఇచ్చాడు’’ అని నవ్య చెబుతూ సిగ్గులు పూయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని