Mishan Impossible Review: రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్
మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఎలా ఉందంటే..?
చిత్రం: మిషన్ ఇంపాజిబుల్; నటీనటులు: తాప్సీ పన్ను, రవీందర్ విజయ్, రోషన్, భాను ప్రకాష్, జైతీర్థ, రిషబ్ శెట్టి, హరీష్ పరేడి తదితరులు; సంగీతం: మార్క్ కె.రాబిన్; కూర్పు: రవితేజ గిరిజాల; ఛాయాగ్రహణం: దీపక్ యెరగరా; దర్శకుడు: స్వరూప్ ఆర్.ఎస్.జె; నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి; విడుదల తేదీ: 01-04-2022
‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల మెప్పు పొందిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే. విభిన్నమైన నాయికా ప్రాధాన్య కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న నటి తాప్సీ. ఇప్పుడీ ప్రత్యేకమైన కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రమే ‘మిషన్ ఇంపాజిబుల్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. చిత్ర టైటిల్‌కు తగ్గట్లుగానే టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సినీప్రియుల దృష్టి ఈ చిత్రంపై పడింది. మరి ప్రచార చిత్రాలతోనే అంతగా ఆకట్టుకున్న ఈ సినిమా వెండితెరపై ఎలా కనిపించింది? చాలా రోజుల తర్వాత తెలుగులో నటించిన తాప్సీకి ఈ చిత్రంతో విజయం దక్కిందా?దర్శకుడు స్వరూప్ ద్వితీయ విఘ్నాన్ని దిగ్విజయంగా దాటాడా? తెలుసుకుందాం పదండి.
కథేంటంటే: తిరుపతి దగ్గర్లోని వడమాల పేటలో ఉన్న రఘుపతి (హర్ష రోషన్), రాఘవ (భాను ప్రకాష్), రాజారామ్ (జైతీర్థ) అనే ముగ్గురు పిల్లల కథ ఇది. ఈ ముగ్గురిని స్నేహం ఒక్కటి చేసింది. వీరివి వేరు వేరు లక్ష్యాలైనా ఆశయం మాత్రం ఒక్కటే.. చాలా ఫేమస్ అవ్వాలి, బోలెడంత డబ్బు సంపాదించాలి. ఈ కలను నిజం చేసుకోవడం కోసం తమ అమాయకత్వంతో ఓ మిషన్ మొదలు పెడతారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకొని పోలీస్‌లకు అప్పజెప్పడం, అతనిపైనున్న రూ.50 లక్షల రివార్డ్‌ను తెచ్చుకోవడం.. ఇదీ ఆ మిషన్ లక్ష్యం. దీనికోసమే ముగ్గురు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబయి బయలుదేరుతారు. కానీ, దారితప్పి బెంగళూరులో దిగుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? దావూద్‌ను పట్టుకోవాలన్న లక్ష్యంతో వచ్చిన ఆ ముగ్గురు పిల్లలతో.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ (తాప్సీ పన్ను) చేయించిన సాహసాలేంటి? చిన్నపిల్లల అక్రమరవాణా కేసుకు, వీళ్లకు ఉన్న లింకేంటి? అన్నది మిగతా కథ.
ఎలా సాగిందంటే: పిల్లలు.. అమాయకత్వంతో వాళ్లు చేసే సాహసాలు.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు.. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే ‘లిటిల్ సోల్జర్స్’ తర్వాత అంత పూర్తి స్థాయిలో పిల్లల చిత్రాలేవీ రాలేదు. ఇప్పుడా లోటును ‘మిషన్ ఇంపాజిబుల్’ కాస్త భర్తీ చేస్తుందనే చెప్పొచ్చు. 2014లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు దర్శకుడు స్వరూప్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని పేపర్లో వచ్చిన ప్రకటన చూసి పట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబయి వెళ్లారు. ఈ సంఘటనకు పిల్లల అక్రమరవాణా అంశాన్ని జత చేసి ఆ కథను వినోదాత్మకంగా తెరపై వడ్డించే ప్రయత్నం చేశారు స్వరూప్. నిజానికి రెండో సినిమాతోనే ఇలాంటి కథతో ప్రయోగం చేయడమంటే కాస్త రిస్కీ వ్యవహారమనే చెప్పాలి. పిల్లల్లో దాగి ఉండే అమాయకత్వాన్ని సరిగ్గా పట్టుకొని దాన్ని తెరపై అంతే సహజంగా ఆవిష్కరించగలిగినప్పుడే సినిమా సరిగ్గా వర్కౌట్ అవుతుంది. ఈ విషయంలో స్వరూప్ చాలా చోట్ల మెప్పించాడు. ఓ హత్య జరగడం.. ఆ వెంటనే చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నాయకుడి కోసం శైలు స్కెచ్ వేయడంలాంటి మిషన్‌తో సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ వెంటనే రఘుపతి, రాఘవ, రాజారాంల కథ మొదలవుతుంది. ఈ ముగ్గురి నేపథ్యాలు.. వారి పరిచయ సన్నివేశాలతో కథనం సరద సరదాగా పరుగులు తీస్తుంది. ముఖ్యంగా దావూద్‌ను పట్టుకోవడం కోసం ఆ ముగ్గురు పిల్లలు వేసే స్కెచ్చులు.. ఈ క్రమంలో వాళ్లు పలికే సంభాషణలు.. చేసే అల్లరి.. ప్రతిదీ ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఆ ముగ్గురూ ఇంట్లో చెప్పకుండా ముంబయికి బయలు దేరడం.. దారి తప్పి బెంగళూరుకు చేరడం.. అదే సమయంలో తన మిషన్ కోసం బెంగళూరు వస్తుండగా శైలుకు యాక్సిడెంట్ కావడం.. ఇలా ఆసక్తికరంగా ప్రథమార్ధం ముగుస్తుంది.
నిజానికి ప్రథమార్ధంలో కథనం చాలా వరకూ లాజిక్కు దూరంగా సాగినా.. పిల్లలు పంచే నవ్వుల మధ్య అది పెద్దగా కనిపించదు. కానీ, ద్వితీయార్ధంలో మాత్రం ఆ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దావూద్‌ను పట్టుకోవడం కోసం ముగ్గురు పిల్లలు పడే కష్టాలు.. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాని పట్టుకోవడం కోసం శైలు చేసే ప్రయత్నాలు చాలా నిరుత్సాహంగా సాగుతాయి. రాజారామ్ కిడ్నాప్ అవ్వడం, అదే సమయంలో శైలుని రఘుపతి, రాఘవ కలవడంతో కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఇక పిల్లల సహాయంతో ముఠాని పట్టుకునేందుకు శైలు వేసే ఎత్తుగడలు చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. ఏ ఒక్క ఎపిసోడ్‌లోనూ సంఘర్షణ కనిపించదు. ఇది ముగింపు పైనా తీవ్ర ప్రభావం చూపించింది.
ఎవరెలా చేశారంటే: తాప్సీ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిజానికి ఆ పాత్రకు కథలో ఉన్న ప్రాధాన్యత చాలా తక్కువే. నటన పరంగానూ పెద్దగా స్కోప్ లేదు. కాకపోతే ఆ పాత్రను తాప్సీ చేయడం వల్ల సినిమాకి స్టార్ బలం తోడైనట్లయింది. నిజానికి ఈ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దుకొని ఉంటే బాగుండేది. రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రలు సినిమాకి బలంగా నిలిచాయి. ఆయా పాత్రల్లో ముగ్గురు పిల్లల నటన ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. స్వరూప్ ఎంచుకున్న కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడంలో పూర్తిగా తడబడ్డాడు. ద్వితీయార్ధం పూర్తిగా తేలిపోయింది. రవీందర్ విజయ్, హరీష్ పేరడి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం బాగుంది. దీపక్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్లుగా నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
+ కథా నేపథ్యం
+ తాప్సీ, ముగ్గురు పిల్లల నటన, వినోదం
బలహీనతలు
- ఊహకు తగ్గట్లుగా సాగే కథనం
- ద్వితీయార్ధం
చివరిగా: కాసేపు కాలక్షేపాన్నిచ్చే పిల్లల మిషన్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)