Shriya: అందరూ మెచ్చే.. ‘మ్యూజిక్‌ స్కూల్‌’

శ్రియ శరణ్‌, శర్మణ్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకుడు. యామినీ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో

Updated : 20 Apr 2022 14:15 IST

శ్రియ శరణ్‌, శర్మణ్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకుడు. యామినీ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. ఇటీవలే గోవాలో నాలుగో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా   ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘గోవాలోని అత్యంత సుందరమైన ప్రదేశాల్లో షూటింగ్‌ చేశాం. ఇప్పటివరకు 95శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో హైదరాబాద్‌లో చివరి పాటను తెరకెక్కించనున్నాం’’ అన్నారు. ‘‘సంగీత ప్రాధాన్యమున్న చిత్రమిది. చిత్రీకరణ ఆద్యంతం సరదా సరదాగా గడిపాం. మా ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తారు’’ అన్నారు నటుడు షాన్‌. ఇది తెలుగు, హిందీ భాషల్లో ఏక  కాలంలో రూపొందుతోంది. కిరణ్‌ డియోహాన్స్‌ ఛాయాగ్రాహకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు