Cinema News: సస్పెన్స్ థ్రిల్లర్
ఆట సందీప్ కథా నాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేంజ్‌రోవర్’. మేఘనరాజ్ కథానాయిక. ఓ.ఎస్.ఆర్.కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా.....
ఆట సందీప్ కథా నాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేంజ్‌రోవర్’. మేఘనరాజ్ కథానాయిక. ఓ.ఎస్.ఆర్.కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఫస్ట్‌లుక్‌ని నటుడు అలీ ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా పేరు బాగుంది. లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటుందనే నమ్మకం ఉంద’’న్నారు. త్వరలోనే ట్రైలర్‌నీ, పాటల్ని విడుదల చేస్తామన్నారు దర్శకనిర్మాత. అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్దన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సత్య సోమేష్.
నవ్విస్తూ.. థ్రిల్ చేస్తూ
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘సురాపానం’. మట్ట మధు యాదవ్ నిర్మించారు. ప్రగ్యా నయన్ కథానాయిక. అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘హీరో చేసిన ఒక పొరపాటు వల్ల కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది. మరి వాటిని అతనెలా దాటొచ్చాడు? ఎదురైన సవాళ్లేంటి? అన్నది దీంట్లో థ్రిల్లింగ్‌గా చూపించాం. వినోదానికి ఎంతో ప్రాధాన్యముంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, ఛాయాగ్రహణం: విజయ్ ఠాగూర్.
మాస్ కథతో కార్తీ..
గ్రామీణ నేపథ్యంగా సాగే పక్కా మాస్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కార్తీ. తను నటిస్తున్న తాజా చిత్రం ‘విరుమన్’. కార్తీతో గతంలో ‘కొంబన్’ తీసిన ఎమ్ ముత్తయ్య ‘విరుమన్’ను తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 31న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు కార్తీ ట్వీట్ చేశాడు. లుంగీ కట్టుకుని వేట కొడవలితో ఉన్న తన లుక్‌ను అభిమానులతో పంచుకున్నాడు. స్టార్ దర్శకుడు శంకర్ తనయ అదితి ఇందులో కథానాయికగా నటిస్తుండటం విశేషం. 2 డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఎస్.కె సెల్వ కుమార్, సంగీతం: యువన్ శంకర్ రాజా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం