Tollywood: ‘టాప్‌ గేర్‌’ వేసిన ఆది

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రియా సుమన్‌ కథానాయిక. శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.శ్రీధర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమాకి ‘టాప్‌గేర్‌’ అనే పేరుని ఖరారు చేశారు.

Updated : 15 Aug 2022 16:13 IST

ది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రియా సుమన్‌ కథానాయిక. శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.శ్రీధర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమాకి ‘టాప్‌గేర్‌’ అనే పేరుని ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టైటిల్‌ లోగోని విడుదల చేశారు. ఇది తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అవుతుందని ఆది సాయికుమార్‌ తెలిపారు. ‘‘ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులకి కనెక్ట్‌ అయ్యే అంశాలుండటం ఈ సినిమా ప్రత్యేకమ’’ని చిత్రవర్గాలు తెలిపాయి. బ్రహ్మాజీ, సత్యం రాజేష్‌, మైమ్‌ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్‌, రేడియో మిర్చి హేమంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కూర్పు: ప్రవీణ్‌ పూడి, కళ: రామాంజనేయులు, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌.


సాఫ్ట్‌వేర్‌ జీవితాల్లో...

శ్రీరాం, భావనా, ఆర్యమాన్‌, మహబూబ్‌ బాషా, కె.ఎస్‌.రాజు, బస్వరాజ్‌ నటీనటులుగా ఉమాశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ బ్లూస్‌’. సిల్వర్‌ పిక్సెల్‌ మీడియా వర్క్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని ఇటీవలే ప్రముఖ దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌లో సంభాషణలు నవ్వించేలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ జీవితాల్లోని సరదా సంఘటనలతో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. శ్రీరాం, భావనలు అందంగా కనిపించడంతోపాటు, బాగా నటించారు. కరోనా మహమ్మారితో ఎదురైన అన్ని సమస్యల్ని దాటుకుని విడుదలవుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంత్రి కేటీఆర్‌, దర్శకుడు క్రిష్‌ మెప్పు పొందింది మా ట్రైలర్‌. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు దర్శకుడు. డా.సునీల్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు