Adipurush: శ్రీరామ నవమి నుంచి శ్రీకారం

‘ఆదిపురుష్‌’ సందడి షురూ కానుంది. శ్రీరామ నవమి నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని చిత్రబృందం నిర్ణయించింది.

Updated : 29 Mar 2023 07:04 IST

‘ఆదిపురుష్‌’ (Adipurush) సందడి షురూ కానుంది. శ్రీరామ నవమి నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని చిత్రబృందం నిర్ణయించింది. ఆ మేరకు దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాత భూషణ్‌కుమార్‌ వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆదిపురుష్‌’ సినిమా జూన్‌ 16న విడుదలవుతున్నట్టు మరోసారి వెల్లడించారు. రామాయణం ఆధారంగా... చెడుపై గెలిచిన మంచిని ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. శ్రీరాముడిగా ప్రభాస్‌ నటించగా, కృతిసనన్‌ సీత పాత్రని పోషించారు. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. సన్నీసింగ్‌ కీలక భూమిక పోషించారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని