Hansika: హన్సిక వివాహం.. కాబోయే భర్త ఫొటోలు షేర్‌ చేసిన నటి

సింగిల్‌ స్టేటస్‌కు గుడ్‌బై చెప్పేసి త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు నటి హన్సిక. త్వరలోనే ఆమె తన స్నేహితుడితో ఏడడుగులు వేయనున్నారు.

Updated : 02 Nov 2022 10:56 IST

చెన్నై: ‘దేశముదురు’ (Desamuduru)తో క్రేజ్‌ సొంతం చేసుకొని, నటిగా దక్షిణాదిలో సెటిల్‌ అయిపోయారు ముంబయి భామ హన్సిక (Hansika). ఈ నటి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. డిసెంబర్‌లో తాను ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపారు.

పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద అతడితో దిగిన ఫొటోలను షేర్‌ చేసిన ఆమె.. ‘ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని పేర్కొన్నారు. మోకాలిపై కూర్చొని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అంటూ హన్సికకు ప్రపోజ్ చేయగా.. అందుకు అంగీకారం తెలిపిన ఆమె.. అతడిని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ఈజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్‌ 4న కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్‌ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. హన్సిక నటించిన ‘పార్ట్‌నర్‌’, ‘105 మినట్స్‌’ చిత్రాల షూటింగ్‌ పూర్తవగా.. తెలుగులో ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’, తమిళంలో నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని