KGF3: ‘కేజీఎఫ్‌3’.. సెట్స్‌పైకి అప్పుడే

యశ్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో  రూపొందిన ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలు  బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాలు అందుకున్నాయి. ఇటీవలే విడుదలైన  ‘కేజీఎఫ్‌2’ సైతం రికార్డు స్థాయి వసూళ్లతో సత్తా చాటింది.

Updated : 15 May 2022 09:06 IST

యశ్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో  రూపొందిన ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలు  బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాలు అందుకున్నాయి. ఇటీవలే విడుదలైన  ‘కేజీఎఫ్‌2’ సైతం రికార్డు స్థాయి వసూళ్లతో సత్తా చాటింది. దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌3’ని తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. మరి అదెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? విడుదల ఎప్పుడు? అన్నది ఇంత వరకు తేలలేదు. దీనిపై నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాదిలోనే ‘కేజీఎఫ్‌3’ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘సలార్‌’తో బిజీగా ఉన్నారు. అదిప్పటికే దాదాపు 35శాతం పూర్తైంది. త్వరలోనే మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది  అక్టోబర్‌ - నవంబర్‌ నాటికి దాన్ని పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే అక్టోబర్‌ నుంచే ‘కేజీఎఫ్‌3’ని ప్రారంభించనున్నాం. 2024లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఫ్రాంచైజీని మార్వెల్‌ యూనివర్స్‌లా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం’’ అని కిరగందూర్‌ చెప్పారు. మరి ఈ సినిమా మొదలయ్యేలోపు యశ్‌ మరో సినిమా చేస్తాడా? లేకుంటే దీనికోసమే వేచి చూస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని