vijay Deverakonda: అలెప్పీలో ‘ఖుషి’ ఖుషీగ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీ శర్మ, జయరాం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Kushi). మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీ శర్మ, జయరాం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్ర కొత్త షెడ్యూల్ అలెప్పీలో మొదలైంది. ఈ విషయాన్ని దర్శకుడు శివ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. దాదాపు వారం పాటు సాగే ఈ షెడ్యూల్‌లో విజయ్, సమంతలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ‘‘రెండు భిన్నమైన నేపథ్యాలు కలిగిన ఓ జంట మధ్య సాగే ఆహ్లాదకరమైన ప్రేమ కథా చిత్రమిది. కశ్మీర్ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, ఛాయాగ్రహణం: జి.మురళి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kerala: నిఫా నాల్గో వ్యాప్తిలో.. మరణాల శాతం ‘33’కే కట్టడి!
-
Nadendla Manohar: ఏపీకి జగన్ అవసరం లేదు: తెనాలిలో నాదెండ్ల మనోహర్
-
Ashwin : ఇదే నా చివరి వరల్డ్ కప్ కావచ్చు.. ఆలస్యంగా జట్టులోకి వచ్చినందుకు బాధేం లేదు: అశ్విన్
-
Sri Sri Ravi Shankar: ప్రపంచమంతా ఒకే కుటుంబం: శ్రీశ్రీ రవిశంకర్
-
Chandrababu Arrest: జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ త్రివేది బెంచ్ ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్
-
సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆపి.. పసిబిడ్డ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి..!