NTR 30: పనులు చకచకా

కథానాయకుడు ఎన్టీఆర్‌ విహార యాత్రలో ఉన్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి అమెరికాకి బయల్దేరి వెళ్లారు.

Updated : 14 Dec 2022 07:20 IST

కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) విహార యాత్రలో ఉన్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి అమెరికాకి బయల్దేరి వెళ్లారు. మరోవైపు ఆయన సూచనల మేరకు ఇక్కడ తదుపరి సినిమాకి సంబంధించిన పూర్వనిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. యువ సుధ ఆర్ట్స్‌ పతాకంపై మిక్కిలినేని సుధాకర్‌ నిర్మించనున్నారు. వచ్చే జనవరి ఆఖరులో కానీ, లేదంటే ఫిబ్రవరిలోకానీ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ఇప్పటికే సంగీత చర్చలు షురూ అయ్యాయి. ఇటీవల హైదరాబాద్‌లో యువ సుధ ఆర్ట్స్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. నిర్మాతలు దిల్‌రాజు, డి.వి.వి.దానయ్యతోపాటు పలువురు సినీ ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని