Ram Charan: రామ్‌చరణ్‌ సినిమా @ చార్మినార్‌

రామ్‌చరణ్‌ (Ram Charan), శంకర్‌ (Shankar) కలయికలో వస్తోన్న సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది.

Updated : 10 Feb 2023 06:54 IST

రామ్‌చరణ్‌ (Ram Charan), శంకర్‌ (Shankar) కలయికలో వస్తోన్న సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. చార్మినార్‌ వద్ద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలియజేశారు దర్శకుడు శంకర్‌. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎస్‌.జె సూర్య, అంజలి, నాజర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆర్‌సీ15’ (వర్కింగ్‌ టైటిల్‌)(RC 15)గా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని