Prabhas: ‘సలార్’ వస్తుందా?వాయిదానా?: స్పందించిన చిత్రబృందం
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న సినిమా ‘సలార్’ (Salaar). ఈ చిత్రం విడుదలపై వస్తోన్న రూమర్స్‌కు చిత్రబృందం చెక్ పెట్టింది.
హైదరాబాద్: ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’ (Salaar). భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘సలార్’ వాయిదా పడనుందనే ఓ వార్త కొన్ని రోజుల నుంచి నెట్టింట తెగ ప్రచారమవుతోంది. దీంతో కొందరు నెటిజన్లు చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ విడుదల విషయం పై క్లారిటీ ఇవ్వాలని కోరారు.
ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ‘ఎలాంటి ఆధారం లేని వార్తలను నమ్మకండి. ‘సలార్’ అనుకున్న సమయానికే విడుదలవుతుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి’ అని ట్వీట్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెగ రీట్వీట్ చేస్తున్నారు. ఇక ‘సలార్’ రెండు భాగాలుగా రానుందని గతంలో కన్నడ నటుడు దేవరాజ్ ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘నా పాత్రకు ‘సలార్’ మొదటి భాగంలో కంటే రెండో భాగంలో అధిక ప్రాధాన్యం లభించింది’ అని చెప్పారు. దీంతో ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందని తేలిపోయింది.
ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోవైపు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) ట్రైలర్ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇక వీటితో పాటు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’(Project K)తో బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
World News
Cannes: కేన్స్ వేదికగా ఇరాన్లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్ నిరసన
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!