Tiger Nageswarao: రూ.7 కోట్లతో.. ఓ ఊరు

రవితేజ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నాయికలు. 70వ దశకంలో స్టూవర్టుపురం రాబిన్‌ హుడ్‌గా పేరు పొందిన..

Updated : 17 Apr 2022 08:22 IST

రవితేజ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నాయికలు. 70వ దశకంలో స్టూవర్టుపురం రాబిన్‌ హుడ్‌గా పేరు పొందిన టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందుతోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రం కోసం 70వ దశకం నాటి స్టూవర్టుపురంను తలపించేలా భారీ సెట్‌ను నిర్మిస్తోంది చిత్ర బృందం. శంషాబాద్‌ సమీపంలోని 5ఎకరాల విస్తీర్ణంలో... దాదాపు రూ.7కోట్ల ఖర్చుతో ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా పర్యవేక్షణలో ఈ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక ఎపిసోడ్లన్నీ ఇందులోనే చిత్రీకరించనున్నట్లు   తెలిసింది. దీనికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: ఆర్‌ మదీ. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని