Bollywood: షారుక్‌.. కొత్త లుక్‌

దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ‘పఠాన్‌’. దీపికా పదుకొణె జోడీగా నటిస్తోంది. జాన్‌ అబ్రహం ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తుండగా

Updated : 26 Sep 2022 11:52 IST

దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ‘పఠాన్‌’ (Pathaan). దీపికా పదుకొణె జోడీగా నటిస్తోంది. జాన్‌ అబ్రహం ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తుండగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆదివారం అభిమానుల కోసం షారుక్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక ఫొటో పంచుకున్నారు. అందులో చొక్కా విప్పి ఉండటంతో తన సిక్స్‌ప్యాక్‌, కండల ప్రదర్శన చేస్తున్నట్టుగా ఉందా చిత్రం. ఇన్‌స్టాలో ఈ ఫోటోకి కామెంట్లు పోటెత్తుతున్నాయి. హాట్‌గా, మ్యాన్లీగా ఉన్నారంటూ అభిమానులు స్పందిస్తున్నారు. యాక్షన్‌, గూఢచర్యం కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కానుంది.


‘పొన్నియిన్‌ సెల్వన్‌’కి అజయ్‌ దేవ్‌గణ్‌ గొంతు  

ణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక కలల చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). దీనిపై రోజురోజుకీ దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, కార్తి, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీత దర్శకుడు. ‘రోజా’ నుంచే మణిరత్నంకి బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అగ్ర కథానాయకుడు అజయ్‌ దేవ్‌గణ్‌తో హిందీ వెర్షన్‌కి నరేషన్‌ చెప్పించారు. మణిరత్నం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘హిందీ పరిశ్రమలో నేను ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒకరు అనిల్‌కపూర్‌. హిందీ ట్రైలర్‌కి గొంతునిచ్చారు. రెండో వ్యక్తి అజయ్‌ దేవ్‌గణ్‌ సినిమా మొత్తానికి వాయిస్‌ ఇచ్చారు’ అన్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై మణిరత్నం సహనిర్మాతగా సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని