Prabhas: మర్యాద పురుషోత్తం.. ప్రభు శ్రీరామ్‌

ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణ ఇతివృత్తంతో ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్నారు. సీతగా కృతి సనన్‌ నటిస్తుండగా..

Updated : 24 Oct 2022 11:26 IST

ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణ ఇతివృత్తంతో ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్నారు. సీతగా కృతి సనన్‌ నటిస్తుండగా.. లంకేశుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషిస్తున్నారు. ఆదివారం ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో ఆయన రాముడిగా విల్లంబులు చేతబూని.. వానర సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరుతున్నట్లుగా కనిపించారు. ఈ పోస్టర్‌ను ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘‘మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరామ్‌’’ అని రాశారు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ త్రీడీ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోలు పుట్టరు.. ఉద్భవిస్తారు!
ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్ర బృందం ఆదివారం ఓ కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల   చేసింది. అందులో ప్రభాస్‌ చేతిని.. ఐరన్‌మ్యాన్‌    తరహాలో ఓ సూపర్‌ హీరో చేయిలా చూపించారు.   ‘‘హీరోలు పుట్టరు.. ఉద్భవిస్తారు’’ అని ఆ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యనూ జత చేశారు. వినూత్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా ‘సలార్‌’ చిత్రబృందం ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని