Bollywood: మరో బయోపిక్‌లో మాధవన్‌

‘రాకెట్రీ’ చిత్రంతో మరోసారి తనలోని  నటనని, దర్శకత్వ   ప్రతిభని చాటిన మాధవన్‌... మరో బయోపిక్‌ చేయనున్నారా? అంటే... కోలీవుడ్‌ నుంచి అవుననే సమాధానం వస్తోంది. మాధవన్‌ ప్రస్తుతం తన హిందీ చిత్రం ‘ధోకా’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా

Updated : 19 Aug 2022 07:00 IST

‘రాకెట్రీ’ (Rocketry) చిత్రంతో మరోసారి తనలోని నటనని, దర్శకత్వ ప్రతిభని చాటిన మాధవన్‌ (Madhavan)... మరో బయోపిక్‌ చేయనున్నారా? అంటే... కోలీవుడ్‌ నుంచి అవుననే సమాధానం వస్తోంది. మాధవన్‌ ప్రస్తుతం తన హిందీ చిత్రం ‘ధోకా’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన తమిళనాడుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు చంపాకరమన్‌ పిల్లై (Chempakaraman Pillai) జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని తొలుత ఇంగ్లీషులో తీసి, తర్వాత భారతీయ భాషల్లో డబ్‌ చేయనున్నారు. రాజేష్‌ అనే  దర్శకుడు తెరకెక్కించనున్నారు. ‘‘నాలుగేళ్లుగా చంపాకరమన్‌ జీవితంపై పరిశోధన సాగింది. స్క్రిప్ట్‌ చివరి దశకు వచ్చింది. ఫోన్‌ చేసి విషయం చెప్పగానే మాధవన్‌ చేస్తానని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది’’ అని దర్శకుడు చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా బెర్లిన్, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది.


‘తారిక్‌’గా జాన్‌ అబ్రహం 

‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’తో మెప్పించిన జాన్‌ అబ్రహం (John Abraham) ‘తారిక్‌’ (Tariq) పేరుతో కొత్త సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. ఇది వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభనా యాదవ్, సందీప్‌ లేజెల్‌తో కలిసి ఈ చిత్రాన్ని జాన్‌ అబ్రహం స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. అరుణ్‌ గోపాలన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రితేష్‌ షా, లలిత్‌ మరాఠే కథనందించారు. ‘‘తారిక్‌’గా ఆగస్టు 15, 2023న మీ ముందుకు వస్తున్నాను. ‘టెహ్రాన్‌’, ‘బాట్లా హౌజ్‌’ తర్వాత బేక్‌ మై ఫిల్మ్స్‌ సంస్థతో మరోసారి కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వివరాలు వెల్లడిస్తూ సినిమాకు సంబంధించి తొలి పోస్టర్‌ని విడుదల చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని