Cinema News: ‘రారాజు’ విచ్చేస్తున్నారహో..

యశ్‌, ఆయన సతీమణి రాధిక పండిట్‌ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘సంతు స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌’. మహేష్‌ రావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘రారాజు’ పేరుతో విడుదల చేయనున్నారు నిర్మాత వి.ఎస్‌.సుబ్బారావు.

Updated : 18 May 2022 06:41 IST

శ్‌, ఆయన సతీమణి రాధిక పండిట్‌ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘సంతు స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌’. మహేష్‌ రావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘రారాజు’ పేరుతో విడుదల చేయనున్నారు నిర్మాత వి.ఎస్‌.సుబ్బారావు. ఈ సినిమా.. జూన్‌ ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘యశ్‌, ఆయన సతీమణి రాధిక కలిసి నటించిన ఈ సినిమా కన్నడలో భారీ విజయాన్ని అందుకొంది. అందుకే ఇప్పుడు తెలుగులో ‘రారాజు’గా విడుదల చేస్తున్నాం. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. సంగీతం: హరికృష్ణ, ఛాయాగ్రహణం: ఆండ్రూ.  


గ్రాఫిక్స్‌ హంగులతో ‘కంచుకోట’

ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ముఖ్య పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘కంచుకోట’. ఎం.ఎ.చౌదరి, వంశీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడు రాజశేఖర్‌ మేనల్లుడు మదన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. ఆశ, దివ్య కథానాయికలు. ఈనెల 18న ప్రతాని రామకృష్ణ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర టైటిల్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇదొక చారిత్రక నేపథ్య చిత్రం. 40శాతం గ్రాఫిక్స్‌ వర్క్‌ ఉంటుంది. నేనిందులో గురూజీ పాత్ర పోషించా. మంగ్లీ పాడిన ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్‌ నటించిన ‘కంచుకోట’లా మా సినిమా విజయవంతం సాధించాలని మా బృందం కృషి చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, మోహన్‌ వడ్లపట్ల, ఏ.గురురాజ్‌, వంశీ, దివ్య, ఆశ తదితరులు పాల్గొన్నారు.


సాంబ ప్రతీకార కథ

సంపూర్ణేష్‌బాబు హీరోగా ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ధగడ్‌ సాంబ’. ఆర్‌.ఆర్‌.బీహెచ్‌. శ్రీను కుమార్‌ రాజు నిర్మించారు. సోనాక్షి కథానాయిక. ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార కథతో రూపొందిన చిత్రమిది. వినోదంతో పాటు యాక్షన్‌కు ప్రాధాన్యముంటుంది. దీంట్లో ఐదు పాటలు, ఐదు ఫైట్స్‌ ఉన్నాయి. వినోదం కథలో భాగంగానే ఉంటుంది తప్ప ఎక్కడా ఇరికించినట్లు ఉండదు. సంపూ పాత్ర సస్పెన్స్‌లా ఉంటుంది. ఆయన ఇందులో సరికొత్తగా కనిపిస్తారు. అసభ్యతకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి హాయిగా చూడగలిగేలా చిత్రం ఇది’’ అన్నారు. సంగీతం: డేవిడ్‌, ఛాయాగ్రహణం: ముజీర్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts