20 ఏళ్ల బాధ.. 20 నిమిషాల్లో చెప్పలేను: స్వాతి

‘‘20 ఏళ్ల బాధ.. ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం కూడా లేదు’’ అని అంటున్నారు నటి స్వాతి (Swathi). చాలారోజుల...

Published : 29 Sep 2022 13:10 IST

హైదరాబాద్‌: ‘‘20 ఏళ్ల బాధ.. ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం కూడా లేదు’’ అని అంటున్నారు నటి స్వాతి (Swathi). చాలారోజుల తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మంత్ ఆఫ్‌ మధు’లోని (Month Of Madhu)  డైలాగ్‌ ఇది. నవీన్‌చంద్ర (Naveen Chandra) హీరోగా సిద్ధమైన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నవీన్‌చంద్ర వింటేజ్‌ లుక్‌లో యువకుడిగా కనిపించారు. టీజర్‌ని బట్టి చూస్తే భార్యాభర్తల మధ్య క్షణికావేశంలో వచ్చే చిన్న తగాదాలు.. దానివల్ల వారిద్దరి జీవితాల్లో ఏర్పడే కలతల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ బట్టి తెలుస్తోంది.

‘‘నేను నీకో విషయం చెబుతున్నా కళ్లు మూసుకో. ఐ లవ్‌ మధు’’ అంటూ స్వాతి చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. ‘‘20 ఏళ్ల క్రితం నెత్తినోరు బాదుకున్నా వినకుండా.. ఆ మధుగాడిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో వాడితోనే విడాకులు కావాలంటూ రోడ్డు ఎక్కావు. సరైన కారణాలు కూడా చెప్పడం లేదు’’ వంటి సంభాషణలు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి.

నరేశ్‌ కొత్త సినిమా.. రిలీజ్‌ ఎప్పుడంటే..!

అల్లరి నరేశ్‌ (Naresh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకుడు. రాజేష్‌ దండు నిర్మాత. ఆనంది కథానాయిక. నరేశ్‌ 59వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఇది సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. నవంబర్‌ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.

‘దసరా’.. సాంగ్‌ వచ్చేస్తోంది..!

నేచురల్‌ స్టార్‌ నాని (Nani) హీరోగా సిద్ధమవుతోన్న చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. కీర్తి సురేశ్‌ కథానాయిక. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. నాని ఇప్పటి వరకెప్పుడూ చేయని ఓ విభిన్నమైన పాత్రని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఓ సరికొత్త అప్‌డేట్‌ వచ్చింది. దసరా కానుకగా ‘దసరా’ ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts