
Cinema News: తపనలు తడిసే
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మాత. శేఖర్ చంద్ర స్వరాలందించారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్రం నుంచి మూడో లిరికల్ గీతాన్ని విడుదల చేశారు. ‘‘చిటపట చినుకులు కురిసెనులే.. యదలో అలజడి రేగే.. పడిపడి తపనలు తడిసెనులే’’ అంటూ సాగిన ఈ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు సాహిత్యమందించగా.. మల్లికార్జున్, మాళవిక సంయుక్తంగా ఆలపించారు. ‘‘కొత్తదనం నిండిన ప్రేమ కథతో రూపొందించిన చిత్రమిది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. కూర్పు: విప్లవ్ నైషదం, ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి మాసం.
ఈ విజయం.. మా కష్టాన్ని మరిపించింది
వినయ పాణిగ్రాహి, త్రినాథ్ వర్మ, రవీంద్ర రెడ్డి, భావన సాగి, స్వాతి మండాది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధ్వని’. ఆగ దుర్గారావు సానా దర్శకుడు. పరమకృష్ణ, సాధన నన్నపనేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సినిమాకి మంచి స్పందన దక్కడంతో స్క్రీన్స్ పెంచాం. ఈ విజయం మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది’’ అన్నారు. ‘‘చిత్రాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు.
మంచి విలన్
విజయ్, శ్రావ్య జంటగా రాజారెడ్డి పానుగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. కేరాఫ్ మహాదేవపురం.. ఉపశీర్షిక. వి.సాయి లక్ష్మీ నారాయణ గౌడ్, పి.శ్రవణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే టీజర్‌ను నటుడు మంచు మనోజ్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్ బాగుంది. ఈ సినిమాని రాజారెడ్డి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. దుబాయ్, కొండమడుగు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అన్నారు చిత్ర దర్శకుడు.
వినోదభరితంగా ‘సాఫ్ట్వేర్ బ్లూస్’
శ్రీరామ్, భావన జంటగా ఉమాశంకర్ తెరకెక్కించిన చిత్రం ‘సాఫ్ట్వేర్ బ్లూస్’. సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించారు. ఆర్యమాన్, మహబూబ్ బాషా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయి? టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వాళ్లు పడే టెన్షన్స్ ఎలా ఉంటాయి? అన్నది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించాం. ఆద్యంతం ట్విస్ట్‌లు, మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది’’ అన్నారు. సంగీతం: సుభాష్ ఆనంద్, ఛాయాగ్రహణం: నిమ్మ గోపి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Health: ఉబ్బిన సిరలకు సూపర్ గ్లూ..ఏంటో తెలుసుకోండి
-
General News
Andhra News: ఈఏపీసెట్-2022కు ఏర్పాట్లు పూర్తి... ఏపీ, తెలంగాణలో పరీక్షాకేంద్రాలు
-
Politics News
Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
-
India News
తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
-
Movies News
Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
-
Politics News
BJP: తొలిరోజు రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చించిన భాజపా జాతీయ కార్యవర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్‌చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ