Cinema News: శర్వా.. కొత్త కబురు
ఇటీవలే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు శర్వానంద్. దీని తర్వాత ఆయన మరో కొత్త కబురేదీ వినిపించలేదు. అయితే, ఇప్పుడాయన ఓ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
ఇటీవలే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు శర్వానంద్. దీని తర్వాత ఆయన మరో కొత్త కబురేదీ వినిపించలేదు. అయితే, ఇప్పుడాయన ఓ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దర్శకుడు కృష్ణచైతన్య చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించేందుకు సిద్ధమైంది. చైతన్య మార్క్ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుందని, శర్వా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయని తెలిసింది. ఇది జూన్‌లో లాంఛనంగా ప్రారంభం కానుంది. జులై నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధమవుతోంది.
‘చిత్తం మహారాణి’ ప్రేమకథ
‘ఇప్పడు జరిగేవన్నీ ప్రేమ పెళ్లిల్లే సార్.. సక్సెస్ అయితే మనం ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటాం...లేదంటే ఇంకొకడు ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటాం’ అని కొత్త ప్రేమ సూత్రాలు చెబుతూ మన ముందుకు రానున్నాడు నూతన కథానాయకుడు యజుర్వేద్. తను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘చిత్తం మహారాణి’. రచన ఇందర్ కథా నాయిక. సునీల్, హర్షవర్థన్, సత్య, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యువ కథానాయకుడు విశ్వక్సేన్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల అయింది. ప్రచార చిత్రాన్ని చూస్తుంటే దర్శకుడు కాశీ విశ్వనాథ్ ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథను చెప్పనున్నారని తెలుస్తోంది. జె.ఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టి.ఆర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి.
‘ఇంద్రాణి’ జోరు
యానియా భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్‌గర్ల్ చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫ్రనైట జిజిన కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ఫ్రనైట ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత స్టీఫెన్ మాట్లాడుతూ.. ‘‘మూడు పాత్రల చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. ఇందులో యానియా సూపర్‌గర్ల్‌గా టైటిల్ పాత్రలో కనిపించనుంది. ఆమెకు దీటైన పాత్రను ఫ్రనైట పోషిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. దీన్ని ఈ ఏడాది అక్టోబర్ 27న విడుదల చేయనున్నాం’’ అన్నారు. సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్