Updated : 06 Jul 2022 14:27 IST

Tollywood: క్రైమ్‌ కామెడీతో..

రేష్‌ అగస్త్య (Naresh Agastya) హీరోగా వీరభద్రమ్‌ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నబీ షేక్‌, తూము నర్సింహా పటేల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్వేత అవస్తిని కథానాయికగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘విభిన్నమైన క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈనెలలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది’’ అని నిర్మాతలు తెలిపారు.


‘కొండవీడు’లో ఏం జరిగింది?

శ్వేతా వర్మ, ప్రతాప్‌ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్‌, నవీన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కొండవీడు’ (Kondaveedu). సిద్ధార్థ్‌ శ్రీ తెరకెక్కించారు. ప్రతాప్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఈనెల 8న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటి శ్వేతా వర్మ మాట్లాడుతూ.. ‘‘కథా బలమున్న చిత్రమిది. కొవిడ్‌ టైమ్‌లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మా ప్రయత్నాన్ని   ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అంది. ‘‘అటవీ నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఫైట్స్‌, పాటల  విషయంలో ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు    దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు మంచి కథ రాశారు. శ్వేతాతో పాటు మిగిలిన నటీనటులు చక్కగా నటించారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.


కనువిప్పు కలిగించే.. ‘ధర్మచక్రం’

సంకేత్‌ తిరుమనీడి, మోనిక చౌహాన్‌   నాయికానాయకులుగా.. పద్మనారాయణ ప్రొడక్షన్‌   బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ధర్మచక్రం’ (Dharmachakram). నాగ్‌ ముంత దర్శకుడు. మంగళవారం పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి వరుణ్‌ క్లాప్‌ కొట్టగా, రాజశేఖర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎ.శ్రీధర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్‌ ముంత మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు రోజూ చూస్తున్నాం. వీటిని అరికట్టేలా, అమ్మాయిలకు స్వీయ రక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో కథనాయిక ద్విపాత్రాభినయం చేస్తోంది. సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’ అన్నారు. నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ ‘సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలే ఇందులో కథాంశం’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: ప్రణయ్‌ రాజపుటి, ఛాయాగ్రాహకుడు: ఎం.ఆనంద్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని